MBNR: మదనాపురం మండలం నర్సింగాపురం గ్రామంలో ఎంపీ నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను దేవరకద్ర నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జ్ కొండ ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని, అర్హులైన పట్టభద్రులు ఓటరు నమోదు చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
నర్సింగాపురంలో హైమాస్ట్ లైట్లు ప్రారంభం


