WGL: వర్ధన్నపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కోతుల బెడద నివారణకు గ్రామస్థులు చర్యలు చేపట్టారు. గ్రామస్థులంతా తలో కొంత చందా వేసుకుని, సర్పంచ్ కౌడగని సునీత రాజేష్‌ఖన్నా ఆధ్వర్యంలో సోమవారం కోతులను పట్టించి సమీప అడవిలో వదిలేయాలని నిర్ణయించారు. కోతుల బెడద నుంచి తమను, పంటలను రక్షించుకునేందుకే ఈ చర్యలు చేపడుతున్నట్లు గ్రామస్థులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: 'కోతుల బెడద నివారణకు గ్రామస్తుల చర్యలు'


