హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేద కుటుంబానికి అండగా నిలిచిన గ్రామస్తులు

NLG: శాలిగౌరారం గ్రామ పంచాయతీ పరిధిలోని మార్కెట్‌ యార్డులో రూపాని అనసూర్య ఇటీవల మృతిచెందారు. పేద కుటుంబం కావడంతో స్థానికులు మానవత్వంతో స్పందించి అండగా నిలిచారు. BRS యువజన మండల అధ్యక్షుడు కల్లూరి నాగరాజు రూ. 5వేలు, 8వ వార్డు సభ్యురాలు బల్లెం సత్తమ్మ వెంకటయ్య 50 కిలోల బియ్యం, రాపాక రాజు 25 కిలోల బియ్యం అందజేశారు. కార్యక్రమంలో స్థానికులు పాల్గొన్నారు.