హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిర్గాపూర్ 'ప్రజావాణి'కి ఒకే ఒక్క దరఖాస్తు

SRD:​ సిర్గాపూర్ మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ప్రజల నుంచి కేవలం ఒకే ఒక్క దరఖాస్తు వచ్చినట్లు ఎంపీడీవో ఆండాలమ్మ తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న వివిధ సమస్యల పరిష్కారం కోసం సంబంధిత శాఖల అధికారులకు ప్రజావాణిలో దరఖాస్తులు అందజేయవచ్చని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.