హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు ఇవే...!

నెల్లూరు: వరికుంటపాడు మండలంలో మంగళవారం సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఆరోజు మధ్యాహ్నం 1.15 గంటలకు ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో బయలుదేరి 2.15 గంటలకు రామాపురం హెలి ప్యాడ్‌కు చేరుకుంటారు. 2.35 గంటలకు కాకొల్లు వారి పల్లెకు చేరుకొని బీటీ రోడ్డు, శ్రమదానం చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 5.30 గంటలకు ఉండవల్లికి తిరుగు పయనమవుతారు.