హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: పాఠశాల పరిసరాల్లో మురుగు.. విద్యార్థులపై ఎఫెక్ట్

ASF: బెజ్జూర్ మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాల పరిసరాల్లో మురుగునీరు నిలిచి విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. ప్రహరీ చుట్టూ చెత్తాచెదారం పేరుకుపోవడంతో దోమలు విపరీతంగా పెరిగి విద్యార్థులకు వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే పారిశుద్ధ్య చర్యలు చేపట్టి మురుగునీటిని తొలగించాలని కోరారు.