RR: తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలో ప్రభుత్వ పశువైద్యుడు లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరు నెలలుగా పశువులకు సకాలంలో వైద్యం అందక నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే పశువైద్యుడిని నియమించాలని కోరుతూ ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
తెలంగాణ
పశువైద్యుడు లేక రైతుల అవస్థలు


