హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏరియా ఆసుపత్రికి వరద ముప్పు నివారణకు చర్యలు

MBNR: జడ్చర్ల కల్వకుర్తి రోడ్డులోని ఏరియా ఆసుపత్రి పరిసరాల్లో వర్షపు నీటి ప్రవాహం, వరద సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించేందుకు అధికారులు చర్యలు చేపట్టనున్నారు. ఈ మేరకు ఈఈ విజయ్ భాస్కర్, మున్సిపల్ కమిషనర్ గిరీష్, డీఈఈ ప్రవీణ్, ఏఈఈ గాయత్రి తదితరులు సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కల్వర్టు, అనుసంధాన రహదారి పనులకు అంచనాలు సిద్ధం చేసి త్వరలో పూర్తి చేయాలని సూచించారు.