హైదరాబాద్: 28°C
తెలంగాణ

'CEC రాజీనామా చేయాలని కాంగ్రెస్ ఆందోళన'

WGL: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ శ్రేణులు సోమవారం వరంగల్‌లో ఆందోళన నిర్వహించారు. ఏఐసీసీ పిలుపు మేరకు పోచమ్మ మైదానంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు రాస్తారోకో, ధర్నా చేపట్టారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న కార్యకర్తలు సీఈసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు