హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పి.గన్నవరం టీడీపీ ఇంచార్జిగా మోకా

కోనసీమ: రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి‌గా మోకా ఆనంద సాగర్ నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేశారు. నియోజకవర్గంలో పార్టీ బలోపేతం, కార్యకర్తల సమన్వయంతో పాటు ప్రజలకు పార్టీని మరింత చేరువ చేసే బాధ్యతలను ఆయన నిర్వహించనున్నారు.