హైదరాబాద్: 28°C
తెలంగాణ

కీరదోస సాగు రైతుకు కలెక్టర్ అభినందనలు

MDK: కౌడిపల్లి మండల పరిధిలోని ముట్రాజ్‌పల్లి పంచాయతీ ఆళ్లగడ్డ తండాలో రైతు రవీందర్ నాయక్ సాగు చేస్తున్న కీరదోస తోటను కలెక్టర్ ప్రతిమ సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట ద్వారా మంచి లాభాలు వస్తున్నాయని రైతు చెప్పడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఎల్నినో ప్రభావం ఉన్నందున తక్కువ నీటితో పూర్తయ్యే ఇటువంటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలని రైతులకు సూచించారు.