SRPT: చిలుకూరు మండలం బేతవోలుకు చెందిన ఆచార్య సతీష్‌కు మహానంది జాతీయ పురస్కారం లభించింది. హనుమకొండలో జరిగిన కార్యక్రమంలో తెలుగు, సంస్కృత రచనలు, పాటలకు గుర్తింపుగా ప్రశంసాపత్రం, పురస్కారంతో పాటు ‘2026 ఆచార్య’ బిరుదుతో సత్కరించారు. పలు కళాశాలల్లో తెలుగు, సంస్కృత ఉపన్యాసకులుగా సేవలందించిన సతీష్‌ను గ్రామస్థులు, మిత్రులు, ఉపాధ్యాయులు అభినందించారు.
తెలంగాణ
ఆచార్య సతీష్‌కు జాతీయ పురస్కారం


