హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భగత్‌సింగ్‌కు నివాళులర్పించిన మాజీమంత్రి

NTR: స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌సింగ్‌ జయంతి సందర్భంగా గొల్లపూడి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా భగత్‌సింగ్‌ దేశ స్వాతంత్య్ర కోసం చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఆయన దేశభక్తి, పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు.