హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ట్రాన్స్‌ఫార్మర్ తరలించాలని నిరసన

NDL: వైఎస్ఆర్ నగర్ బుడగ జంగాల కాలనీలో ట్రాన్స్‌ఫార్మర్‌ తరలించాలని ఇవాళ డీవైఎఫ్‌ఐ డిమాండ్ చేశారు. ట్రాన్స్‌ఫార్మర్‌తో ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టణ కార్యదర్శి శివ ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ ఆదేశించినా విద్యుత్ అధికారులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. తక్షణమే తరలించకపోతే విద్యుత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపడతామని హెచ్చరించారు.