BDK: కుటుంబ కలహాల నేపథ్యంలో ఆదివారం వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్సై యయాతిరాజు తెలిపారు. అశ్వరావుపేట మాదిగ మోడల్ కాలనీకి చెందిన తగరం వెంకటేశ్వరరావు (35) భార్యతో గొడవపడిన అనంతరం మనస్థాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని మృతిచెందాడు. మృతుడి తండ్రి సిద్దయ్య ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ
భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్య


