MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డిపై ఇటీవల తాను చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్లు టీడీపీకి చెందిన ఎస్. రామన్ గౌడ్ తెలిపారు. ఆవేశంలో చేసిన వ్యాఖ్యల పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేస్తూ క్షమాపణలు కోరారు. తన మాటల వల్ల ఎమ్మెల్యే, ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు, ప్రజలకు కలిగిన మనస్తాపానికి చింతిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డికి రామన్ గౌడ్ క్షమాపణ


