PDPL: ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన జూంజిపెల్లి నారాయణ (65) సోమవారం ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల వివరాల ప్రకారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఇంట్లో ఒంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని మృతి చెందినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తెలంగాణ
పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్య


