KDP: చెన్నూరు మండల రైతు సేవా కేంద్రాల్లో 80 శాతం సబ్సిడీపై మినుము విత్తనాలు అందుబాటులో ఉన్నాయని AO శ్రీదేవి తెలిపారు. ఖరీఫ్ సాగు చేయని రైతులు ఆరుతడి పంటగా మినుము సాగు చేసుకోవచ్చన్నారు. మండలానికి 18 క్వింటాళ్ల విత్తనాలు రాగా, రైతులు కిలోకు రూ. 25.90 చెల్లించాలని పేర్కొన్నారు. ఆధార్, పట్టాదారు పాస్‌పుస్తకంతో స్థానిక రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రైతులకు సబ్సిడీతో మినుము విత్తనాలు..!


