హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విషాదం.. ఇద్దరు చిన్నారుల మృతి

ప్రకాశం: మార్కాపురం(D)లో విషాద ఘటన చోటుచేసుకుంది. C.S.పురం(M) మండలం వీ. బైలుకు చెందిన గురవయ్య, సుజాత దంపతులకు ముగ్గురు సంతానం. వీరు ఉపాధి నిమిత్తం 15 ఏళ్ల క్రితం నెల్లూరుకు వెళ్లారు. తల్లిదండ్రులు పనికి వెళ్లగా.. ఆదివారం నెల్లూరులోని హరినాథపురం 2వ లైన్‌లో మిద్దెపై ఆడుకుంటుండగా విద్యుత్ షాక్‌తో అక్కా చెల్లెళ్లు జ్యోతి(11), అమూల్య (7) మృతి చెందారు.