హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాండూరులో పెరిగిన వాయు కాలుష్యం

కాలుష్య నియంత్రణ మండలి సర్వేలో తాండూరు ప్రాంతంలో వాయు కాలుష్యం ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది. సిమెంట్ పరిశ్రమలు, నాపరాయి క్వారీలు, పాలిష్ యూనిట్ల కారణంగా గాలిలో ప్రమాదకర ధూళి కణాల స్థాయి అధికంగా నమోదైనట్లు అధికారులు గుర్తించారు. కాలుష్యం కారణంగా శ్వాసకోశ సమస్యలు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.