AKP: నక్కపల్లి మండలం రాజయ్యపేటలో సోమవారం ఉదయం భారీ చోరీ జరిగింది. చోడిపల్లి చిట్టెమ్మ ఇంట్లోకి చొరబడిన దుండగులు రూ.3 లక్షల నగదుతో పాటు 6 తులాల బంగారాన్ని అపహరించారు. సొత్తు కాజేసిన అనంతరం ఇంటి వెనుక భాగంలోని ముళ్లకంచెలో ఖాళీ ట్రంకు పెట్టెను పడేసి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నక్కపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్
రాజయ్యపేటలో భారీ చోరీ


