హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తుమ్మలపాలెం వద్ద కూరగాయల లారీ బోల్తా

GNTR: ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద సోమవారం ఉదయం కూరగాయల లారీ బోల్తాపడింది. బెంగళూరు నుంచి ఒడిశాకు కూరగాయల లోడుతో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన లారీ రోడ్డుపై పల్టీలు కొట్టింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణహాని జరగలేదు. డ్రైవర్‌కు నిద్రమత్తు రావడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.