VSP: ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. సోమవారం ఉదయం డుంబ్రిగూడ మండల పరిసర ప్రాంతాలలో 23 °C నమోదై, దట్టమైన పొగమంచు కమ్మేసింది. మంచుతో చల్లటి వాతావరణం నెలకొంది. తెల్లారినా వాహనదారులు హెడ్లైట్లు వేసుకొని ప్రయాణించారు. ఉదయం వేళ మంచు తెరలతో పరిసర ప్రాంతాలు ఆహ్లాదకరంగా కనిపించడంతో ఏజెన్సీ ప్రాంతాలకు వచ్చే పర్యాటకులు ప్రకృతిని ఆస్వాదించారు.
ఆంధ్రప్రదేశ్
చలి పెరిగింది.. ఏజెన్సీ అందం రెట్టింపైంది!


