హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాపట్లలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన డీఎస్పీ

BPT: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ ఆదేశాలతో డీఎస్పీ చంద్రమౌళి ఆధ్వర్యంలో బాపట్లలోని పోలింగ్ బూత్‌లను పోలీసులు పరిశీలించారు. కొత్తపాలెం, ఇస్లాంపేట, బెస్తపాలెం ప్రాంతాల్లోని కేంద్రాల్లో భద్రత, సమస్యాత్మక బూత్‌ల వివరాలను సమీక్షించారు. ఎన్నికల వేళ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సిబ్బందిని ఆదేశించారు.