హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారి దర్శనానికి 18 గంటలు

TPT: తిరుమలలో సోమవారం టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు శిలాతోరణం క్యూలైన్ వరకు వేచి ఉన్నారు. ఆదివారం 83,578 మంది శ్రీవారిని దర్శించుకోగా, 31,137 మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.5.07 కోట్ల ఆదాయం వచ్చినట్లు TTD తెలిపింది.