హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలీస్‌స్టేషన్ తనిఖీ చేసిన ఎస్పీ

ప్రకాశం: పామూరు పోలీస్‌‌స్టేషన్‌ను మార్కాపురం జిల్లా ఎస్పీ పంకజ్‌కుమార్‌ మీనా ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. స్టేషన్‌ రికార్డులు, కేసుల స్థితిగతులను పరిశీలించి పెండింగ్‌ కేసులను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు.