హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇవాళ కలెక్టరేట్ వద్ద ధర్నా

AKP: దళితులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ, ఇవాళ అనకాపల్లి కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్లు బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎం. లోవచంద్ తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు, దళితులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.