కోనసీమ: అమలాపురం మున్సిపాలిటీలో మురుగు, నాసిరకం తాగునీటి సరఫరాపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 35వ వార్డులోని ఓ ఇంటి కుళాయిని ఆదివారం తెరవగా తాగునీటితో పాటు బతికున్న తోక కప్పలు బయటకు వచ్చాయని వాపోయారు. రోజువారీ తాగునీటికి మున్సిపల్ సరఫరాపైనే ఆధారపడుతున్నామని, ఈ నీరు తాగితే రోగాలు వస్తాయని ప్రజలు ఆందోళన చెందారు. అధికారులు స్పందించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
తాగు నీటిలో తోక కప్పలు.. ప్రజల ఆగ్రహం


