హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు నగరపాలకలో అర్జీల స్వీకరణ

KRNL: కర్నూలు నగరపాలక సంస్థ నూతన కౌన్సిల్ హాలులో ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు అందజేయవచ్చన్నారు. ఈ కార్యక్రమానికి రాలేనివారు 74229 92299 నంబర్‌కు కాల్ లేదా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు.