హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మాజీ ఎమ్మెల్యే రాక

KRNL: కృష్ణగిరి మండలంలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఎంపీటీసీ సభ్యులకు వైసీపీ ఆధ్వర్యంలో నేడు సాయంత్రం కృష్ణగిరిలో ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు పార్టీ మండల కన్వీనర్ ఆర్బీ వెంకటరాముడు తెలిపారు. ఈ కార్యక్రమానికి పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్ కుమార్ రెడ్డి విచ్చేయనున్నారని చెప్పారు.