హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అంబరాన్ని అంటిన సంబరాలు

VZM: రాజాం మండలం బొద్దాం గ్రామంలో వినాయకుని నిమజ్జన కార్యక్రమం అంగరంగ వైభవంగా సాగింది. గణేశ్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన లడ్డు వేలం పాటలో తర్రా ప్రసాద్ రూ.42 వేలకు వినాయక లడ్డూను దక్కించుకున్నారు. యువత, భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారిని ఊరేగిస్తూ నృత్యాలు చేశారు. చెరువులలో నీరు నిండుగా ఉండటంతో జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు.