హైదరాబాద్: 28°C
క్రీడలు

మిడిల్‌ ఓవర్లలో తడబడ్డాం: విండీస్‌ కెప్టెన్

తొలి వన్డేలో భారత్‌ చేతిలో ఓటమిపై వెస్టిండీస్‌ కెప్టెన్‌ షై హోప్‌ స్పందించారు. మిడిలార్డర్‌ వైఫల్యమే పరాజయానికి ప్రధాన కారణమని తెలిపారు. మధ్య ఓవర్లలో బ్యాటర్లు నిలకడగా ఆడలేకపోయారని పేర్కొన్నారు. కీలక భాగస్వామ్యాలు నెలకొల్పడంలో విఫలమవడంతో ఆశించిన స్కోరు సాధించలేకపోయామని వివరించారు. తదుపరి మ్యాచ్‌లో తప్పులను సరిదిద్దుకుని బలంగా పుంజుకుంటామన్నారు.