హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

15 మల్టీ కలర్ ఫౌంటెయిన్లు: మంత్రి నారాయణ

NLR: నగరంలో అక్టోబరు నెలాఖరు కల్లా 15 కలర్ ఫౌంటెయిన్లు అందుబాటులోకి తీసుకొస్తామని మంత్రి నారాయణ తెలిపారు. ఆదివారం రాత్రి నగరంలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. 15 ప్రధాన జంక్షన్లలో రూ. 10 కోట్లతో మల్టీ కలర్ వాటర్ ఫౌంటెయిన్లు, సుందరీకరణ పనులతో పాటు సీసీ రోడ్లు, డ్రైన్ల నిర్మాణ పనులన్నింటినీ రాబోయే 30 రోజుల్లో పూర్తి చేస్తామన్నారు.