హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వచ్చే నెల 2న ఖో-ఖో జట్ల ఎంపికలు

శ్రీకాకుళం పీఎస్ఎన్ఎం హెచ్ పాఠశాల మైదానంలో వచ్చే నెల 2న జిల్లా స్థాయి ఖో-ఖో ఎంపికలు నిర్వహిస్తామని సంఘ జిల్లా అధ్యక్షుడు నాగభూషణం తెలిపారు. 2008 డిసెంబర్ 1 తర్వాత జన్మించిన వారు, ఇండెక్స్ 250 పాయింట్ల లోపు ఉన్నవారు ఉ. 9 గంటలకు జనన ధ్రువపత్రాలతో హాజరు కావాలన్నారు.ఈ ఎంపికల్లో ప్రతిభ చూపినవారు కృష్ణా జిల్లాలో రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు