VSP: రాష్ట్రస్థాయి పారా స్విమ్మింగ్ పోటీలు అక్టోబరు 5న విజయవాడలో జరగనున్నాయి. ఎంపికలు 29న విశాఖ కంటోన్మెంట్ ఈత కొలనులో ఉంటాయని జిల్లా సంఘ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. 18 ఏళ్లు పైబడినవారు ఆధార్, సదరం సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు హాజరుకావాలి. రాష్ట్రస్థాయిలో ప్రతిభ చూపిన క్రీడాకారులకు జాతీయ పోటీలకు ఎంపికయ్యే అవకాశం ఉంటుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు పారా స్విమ్మింగ్ ఎంపికలు


