SKLM: వజ్రపుకొత్తూరు మండలంలోని సీతాపురానికి చెందిన శతాధిక వృద్ధురాలు దుంపల సాయమ్మ (112) నిన్న కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె అంత్యక్రియలు ఇవాళ గ్రామంలో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శతాధిక వృద్ధురాలు మృతి


