హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటోల దొంగతనం కేసును ఛేదించిన పోలీసులు

అనంతపురం: జిల్లాలో ఆటోల దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. గార్లదిన్నె మండలంలో నెల రోజులుగా జరుగుతున్న వరుస ఆటో దొంగతనాల కేసును ఎస్సై మహమ్మద్ గౌస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. చిత్తూరు జిల్లా రొంపిచర్లకు చెందిన ఇంతియాజ్‌ను అదుపులోకి తీసుకొని, 3 ఆటోలను సోమవారం స్వాధీనం చేసుకున్నారు. వాటిని యజమానులు నాగరాజు, దస్తగిరి, ఆంజనేయులుకు అప్పగించారు.