హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుచానూరులో రికార్డు స్థాయిలో దర్శనాలు

TPT: తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారిని ఆదివారం రికార్డు స్థాయిలో 31,784 మంది భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం కావడంతో ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు, సిబ్బంది, సెక్యూరిటీ, విజిలెన్స్ సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లు, తాగునీరు, ప్రసాదాల సదుపాయాలు కల్పించారు.