హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు అగ్రి ఎక్స్‌పో కిసాన్ మేళా

ATP: బుక్కరాయసముద్రం(M) లకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ఈనెల 29న ‘అగ్రి ఎక్స్‌పో-కిసాన్ మేళా’ నిర్వహించనున్నట్లు ఆత్మా ఇన్‌చార్జి పీడీ విద్యావతి తెలిపారు. కలెక్టర్ ఆనంద్ అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో వ్యవసాయ యంత్రాల ప్రదర్శన, రబీ సాగుపై సూచనలు, ప్రభుత్వ పథకాలపై అవగాహన, రైతులతో శాస్త్రవేత్తల ముఖాముఖి ఉంటాయన్నారు. రైతులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.