హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'జిల్లా అభివృద్ధిపై అవగాహన వీడియోలు చేయాలి'

GNTR: నగర అభివృద్ధికి సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ సహకరించాలని ఎమ్మెల్యే గళ్లా మాధవి కోరారు. ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో సమావేశమై నగర సమస్యలపై సూచనలు స్వీకరించారు. ప్రతి ఒక్కరూ గుంటూరు కోసం కనీసం ఒక అవగాహన వీడియో చేయాలని సూచించారు. విమర్శలకు బదులు పరిష్కార మార్గాలు చూపేలా వీడియోలు రూపొందించాలని కోరారు. సమస్యలను మూడు నెలల్లో పరిష్కరిస్తామన్నారు.