హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మద్యం మత్తులో నేవీ ఉద్యోగి బీభత్సం

VSP: మద్యం మత్తులో నేవీ ఉద్యోగి గణేశ్ భోంస్లే ఆదివారం రాత్రి కారుతో బీభత్సం సృష్టించాడు. చినగంట్యాడ వద్ద 7 బైకులు, 2 కార్లను, ఓ ఇంటి ప్రహరీని ఢీకొట్టాడు. జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు.