హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాధిత కుటుంబాలకు మాజీ డిప్యూటీ సీఎం భరోసా

PPM: మాజీ డిప్యూటీ సీఎం పుష్పశ్రీవాణి నిన్న జియమ్మవలసలోని పలు గ్రామాలలో పర్యటించారు. ఈ సందర్భంగా చినతోలుమండ , చినకుదమ, నీచుకువలస గ్రామాలలో పలు బాధిత బాధిత కుటుంబాలను పరామర్శించి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు వైసీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్‌, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.