హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గణేశుడి లడ్డూలకు రూ.72 వేల ధర

GNTR: మంగళగిరి(M) నవులూరు శివాలయం సెంటర్‌లో ఆదివారం రాత్రి గణేశుడి నిమజ్జన వేడుకలు నిర్వహించారు. తొలుత నాలుగు లడ్డూలకు వేలం పాట జరిగింది. 26 కిలోల లడ్డూ రూ.30 వేలకు బత్తుల నాగరాజుకు దక్కింది. 11 కిలోల లడ్డూను తోట శ్రీనుబాబు రూ.17 వేలకు, 9 కిలోల లడ్డూను బుర్రి శ్రీను రూ.14 వేలకు, 5 కిలోల లడ్డూను అజ్మీర్ రాంబాబు నాయక్ రూ.11 వేలకు దక్కించుకున్నారు.