హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెలుగు కవి గుర్రం జాషువా జయంతి నేడే

PLD: ప్రముఖ తెలుగు కవి గుర్రం జాషువా 1895 సెప్టెంబర్ 28న వినుకొండ(M) చాట్రగడ్డపాడులో జన్మించారు. కుల వివక్ష, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా తన రచనల ద్వారా గళమెత్తిన ఆయన ‘గబ్బిలం’, ‘ఫిరదౌసి’, ‘బాపూజీ’ వంటి ఎన్నో రచనలు చేశారు. పద్మభూషణ్‌తో పాటు పలు బిరుదులు అందుకున్న జాషువా 1971 జూలై 24న గుంటూరులో కన్నుమూశారు. తెలుగు సాహిత్యంలో ఆయన సేవలు చిరస్మరణీయం.