హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అండర్ పాస్‌లో నీరు.. ఇబ్బందుల్లో ప్రజలు!

SKLM: అండర్ పాసేజ్‌లో నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆమదాలవలస మండలం లొద్దలపేటకు చెందిన కాంతారావు అనారోగ్యంతో బాధపడుతుండగా, పొందూరు మండలం బొడ్డేపల్లి అండర్ పాస్‌లో నీరున్నా తప్పక మంచంపై మోసుకెళ్లారు. ఈ మార్గంలో 10 గ్రామాల ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారని, వర్షం వచ్చిన ప్రతిసారీ ఇదే పరిస్థితి నెలకొంటోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.