హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్

శ్రీకాకుళం నగరంలోని తండ్యాంవలసలో ఉన్న జిల్లా పోలీసు శిక్షణ కేంద్రం (డీపీటీసీ)లో 10 నెలలుగా జరుగుతున్న కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తయింది. ఈ నేపథ్యంలో మంగళవారం పాసింగ్ అవుట్ పరేడ్ నిర్వహించనున్నారు. కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన 142 మంది కానిస్టేబుళ్లు ఇక్కడ శిక్షణ పొందారు. పరేడ్‌కు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.