హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా స్థాయి సైన్స్ పోటీల్లో సందడి

CTR: జిల్లాలో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలు నిర్వహించారు. 28 మండలాల నుంచి 40 బృందాలు పాల్గొన్నాయి. స్క్రీనింగ్ టెస్ట్, క్విజ్ నిర్వహించారు. ఎంపికైన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు చెందిన రెండు బృందాలు భీమవరంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు.