W.G: తణుకు మండలం వేల్పూరు గ్రామంలో అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యమైందని తణుకు రూరల్ ఎస్సై ఎన్. శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. ఎనిమిదో తరగతి చదువుతున్న గ్రామానికి చెందిన కావలిపురపు పూజిత శనివారం మధ్యాహ్నం స్కూలు నుంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను గుంటూరు బస్టాండ్లో గుర్తించినట్లు ఎస్సై తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం: ఎస్సై


