హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొలిమిగుండ్లలో పేడ రంగుపై నిషేధం

NDL: కొలిమిగుండ్ల మండలంలో ఇకనుండి పేడ రంగును విక్రయించరాదని దుకాణదారులకు ఇవాళ సిఐ రమేష్ బాబు సూచించారు. సౌభాగ్య పేరుతో తక్కువ ధరకే వస్తున్న పేడ రంగు వల్ల ఎంతో మంది మహిళలు ప్రాణాలను పోగొట్టుకుంటున్నారని ఆయన అన్నారు. మండలంలో ఎక్కడైనా పేడరంగు విక్రయిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని వ్యాపారస్తులను సీఐ రమేష్ బాబు హెచ్చరించారు.