హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెట్టికోట శివాలయంలో సోమవారం పూజలు

NDL: కొలిమిగుండ్ల మండలం పెట్టికోట శివాలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలను ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి శివాలయంలో ఉన్న శివలింగానికి అభిషేకాలు, కుంకుమార్చన ఇంకా అనేక పూజలను చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు పాల్గొన్నారు.